నాగార్జున విక్రమ్ లాగా ట్రై చేశాడా!!

P.Nishanth Kumar
అక్కినేని నాగార్జున ఈ వయసులో కూడా భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలను చేస్తూ ఉండడం ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. నాగార్జున చేసే సినిమాలను తెలుగు సినిమా పరిశ్రమలోని ఏ సీనియర్ హీరో కూడా ట్రై చేయడం లేదనే చెప్పాలి. ఆ విధంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు నాగార్జున. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల అయింది. ఈ సినిమాలో ఉపయోగించే కత్తిని తయారు చేస్తున్న విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

కత్తిని ఏ విధంగా తయారు చేశారో అన్న దృశ్యాలను దర్శకుడు ఎంతో బాగా తెరకెక్కించారు. మరి ఈ దృశ్యం కేవలం టీజర్ కోసం మాత్రమే చిత్రీకరించారా లేదా సినిమాలో కూడా ఉంటుందా అనేది చూడాలి. నాగార్జున ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించడం కూడా ఈ సినిమాపై అంచనాలను పెరగడానికి ప్రముఖ కారణం అవుతుంది.  ఇటీవల కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ తాలూకు స్క్రీన్ ప్లే ఈ సినిమాలో ఉంటుంది అని చెబుతున్నారు.

ఇప్పుడు విడుదలైన ది ఘోస్ట్ ప్రోమోను బట్టి విక్రమ్ సినిమా స్థాయిలోనే ఈ చిత్రం కూడా ఉండబోతుంది అని తెలుస్తుంది. మరి నాగార్జున హిట్ కొట్టి చాలా రోజులే అయిపోయిన నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య రూపొందిన ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఇకపోతే అక్కినేని హీరోల సినిమాలు 100 కోట్ల క్లబ్లోకి చేరడం లేదు అనే విమర్శ ఎప్పటినుంచో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉంది. అది ఈ సినిమాతో తీరుతుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. రా ఏజెంట్ గా నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో సయామీ కేర్ హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: