మంచు విష్ణు 'జిన్నా' మూవీ టీజర్ విడుదల తేదీ ఫిక్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . డి , దేనికైనా రెడీ వంటి పలు విజయవంతమైన మూవీ లలో నటించిన మంచు విష్ణు టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరుచుకున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు 'జిన్నా' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ హీరోయిన్ లుగా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేసింది. వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ ను ఆగస్ట్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ను తెలుగు , హిందీ ,  మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. ఏ వి ఏ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: