ట్రైలర్ : రిపీట్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీనే నమ్ముకున్న హీరో..!!
ఇక ట్రైలర్ లోకి వెళితే.. గేమ్ మొదలుపెట్టిన ఫస్ట్ లోనే ఒకరు తనకి చెక్ పెడితే ఎలా ఉంటుందో అనే డైలాగ్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఒక క్రిమినల్ కు, ఒక ఐపీఎస్ కు మధ్య జరిగి కొన్ని సంఘటనలు ఈ సినిమా ట్రైలర్ ని బాగా ఆకట్టుకునేలా చేస్తున్నాయి. నవీన్ చెప్పిన ప్రతి డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒకవైపు హత్యలు మరొకవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇలా రెండు ఒకేసారి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలోని సన్నివేశాలు అత్యంత థ్రిల్లర్గా మలిచినట్లుగా కనిపిస్తున్నది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఎవరు గెలుస్తారో అనే విషయం తెలియాలి అంటే ఆగస్టు 25 వరకు వెయిట్ చేయాల్సిందే.. ఇక ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయబోతున్నారు ఈ చిత్రంలో స్మృతి వెంకట్ హీరోయిన్గా నటిస్తున్నది.. ఈ చిత్రంలోని ఒక ముఖ్యమైన పాత్రలో మధు నటిస్తున్నారు.ఇక వీరితో పాటే.. మీమీ గోపి, నవీన రెడ్డి నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.