మహేష్ AMB థియేటర్లో తలపతి విజయ్.. ఏ సినిమా చూశారో తెలుసా..?

Anilkumar
తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు దళపతి విజయ్  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఆయన ఈ మధ్య ఎక్కువగా హైదరబాద్ లో సందడి చేస్తున్నారు.అంతేకాదు ఎక్కువగా ఇక్కడే ఉంటున్నారు.ఇకపోతే హైదరాబాద్ లో ప్రముఖులను కలుస్తూ.. ప్రముఖ ప్రదేశాలు చూస్తూ.. తన షూటింగ్స్ చేసుకుంటూ విజయ్ హైదరాబాద్ ను తన సొంత ప్రాంతంగా అలవాటు చేసుకుంటున్నాడు. అయితే ఇక కొన్ని సినిమాలు తప్పించి విజయ్ నటించిన తమళ డబ్బింగ్ సినిమాలన్నీ తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. ఇక పోతే రీసెంట్ గా డైరెక్ట్ తెలుగు సినిమా కూడా స్టార్ట్ చేశాడు విజయ్.

కాగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న సినిమా వారసుడు.అయితే  స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ..నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, లాంటి స్టార్స్ ఇతర పాత్రల్లో నటిస్తు న్న ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ ల జరుగుతోంది.పోతే  ఈసినిమాకు తమన్ స్వారాలు సమకూర్చుతున్నారు.ఇక  వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ.. సూపర్ ఫాస్ట్ గాఈమూవీని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు టీమ్. అయితే షూటింగ్ లో స్టార్స్ అంతా బిజీ బిజీగా ఉన్నారు. అంతేకాదు అటు విజయ్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు.

అయితే ఈ షూటింగ్ బ్రేక్ టైమ్ లో విజయ్ దళపతి మహేష్ బాబకు చెందిన ఏఎమ్బీ మాల్ ను సందర్శించారు. ఇక విరామంలో భాగంగా నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన రీసెంట్ మూవీ బింబిసారను విజయ్‌ చూసినట్టు తెలుస్తోంది. కాగా సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఆగస్టు 15న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు థియేటర్‌ ఏఎమ్‌బీలో చూసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఇకపోతే ఈ వీడియోలో విజయ్‌ బ్లూ షర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌ లో ముఖానికి మాస్క్‌ పెట్టుకుని కనిపించాడు. అయితే మాస్క్ లో ఉన్న విజయ్‌ను గుర్తు పట్టిన ఫొటోగ్రాఫర్స్‌ వెంటనే తమ కెమెరాలకు పని పెట్టారు. పోతే వరుసగా ఫోటోలను క్లిక్‌మనిపించారు.  అయితే ఇక అభిమానుల తాకిడి పెరుగుతంది అనుకున్నాడో ఏమో కాని విజయ్ కారులో వెళ్తుండగా.. ఆయన హీరో డ్రైవర్‌ విజయ్ కనిపించకుండా కవర్ చేసు ప్రయత్నంచేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: