నిజం చెప్తున్నా.. నేను కూడా ఇలాంటి పర్ఫామెన్స్ చేయలేదు : కుష్బూ

praveen
ఇటీవలి కాలంలో జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్స్ మారడమే కాదు అటు జడ్జీలు కూడా ఎక్కువమంది మారుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోజా వెళ్లిపోయిన తర్వాత ఇక రోజా స్థానంలోకి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది. మొన్నటివరకు ఇంద్రజ పక్కన సింగర్ మనో జడ్జిగా కొనసాగారు. కానీ గత కొంత కాలం నుంచి మాత్రం ఒకప్పటి అందాల తార, స్టార్ హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కుష్బూ జబర్దస్త్ జడ్జ్ గా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన హీరోయిన్ తమ అభిమాన షో లో కనిపిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి అని ఎంతోమంది అభిమానులు అనుకుంటున్నారు.

 అయితే జబర్దస్త్ జడ్జ్ గా వచ్చిన తర్వాత కుష్బూ తనదైన జడ్జిమెంట్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మనసులో ఏమి పెట్టుకోకుండా ఒకవైపు కల్మషం లేని నవ్వు తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు జబర్దస్త్ కమెడియన్స్ చేసిన పర్ఫామెన్స్ ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పటికే తనను ఆకట్టుకున్న కొన్ని పర్ఫామెన్స్ లకి తనదైన శైలిలో  ప్రశంసలు కురిపించింది ఖుష్బూ. ఇటీవల మరోసారి ఎక్స్ ట్రా జబర్దస్త్  లో భాగంగా బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ లో చేసిన పర్ఫామెన్స్ కి  ఫిదా అయ్యింది.

 ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్  కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ క్రమంలో ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ మరోసారి సరికొత్త గెటప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోహిణి, వర్ష, పైమాలతో చంద్రముఖి గెటప్పులు వేయించాడు. చంద్రముఖి గెటప్లో ఈ ముగ్గురు లేడీ కమెడియన్స్  చేసిన పర్ఫామెన్స్ కి జడ్జి ఖుష్బూ   ఫిదా అయింది. కాగా స్కిట్ అయిపోయిన తర్వాత స్టేజి మీదికి వచ్చి వారిని అభినందించింది. కెరియర్ లో తాను కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు అంటూ కుష్బూ చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: