ఎన్టీఆర్ కి తల్లిగా నటించే ఛాన్స్ పోగొట్టుకున్నా.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!!

Anilkumar
ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన మిర్చి మాధవి గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఈమె  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే నా స్వస్థలం గుంటూరు అని హైదరాబాద్ లో చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఇకపోతే ఒకే సమయంలో సీరియళ్లు, సినిమాలలో ఆఫర్లు వచ్చాయని ఆమె వెల్లడించారు.ఇదిలావుంటే ఇక  ప్రస్తుతం నేను భోళా శంకర్ సినిమా చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు దాస్ కా ధమ్కీ అనే మరో సినిమాలో కూడా నటించానని ఆమె కామెంట్లు చేశారు.అయితే కళ్యాణ్ దేవ్ గారి అల్లుడు వేరే లెవెల్ అనే సినిమాలో కూడా నటిస్తున్నానని ఆమె అన్నారు.

ఇక  వర్క్ చేసేవాళ్లకు ఎప్పటికీ పని ఉంటుందని ఆమె తెలిపారు.పోతే  సీరియళ్లలో పని చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారని ఆమె కామెంట్లు చేశారు.అంతేకాదు  గుప్పెడంత మనస్సు, రావోయి చందమామ సీరియళ్లలో నేను నటిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక జై లవకుశ ఆఫర్ మిస్ కావడం గురించి ఆమె స్పందిస్తూ టీ తాగేలోపు ఆ టీకి ఏమైనా జరగొచ్చు అని ఆమె అన్నారు.అయితే జై లవకుశ సినిమాలో నా కంటే బెటర్ గా ఎవరైనా చేస్తారని వాళ్లు అనుకుని ఉండవచ్చని మిర్చి మాధవి తెలిపారు. ఇకపోతే ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఒక్కరు ఓకే చెబితే సరిపోదని ఆమె చెప్పుకొచ్చారు.ఇక  ఆ పాత్ర చిన్న పాత్ర అని ఆమె కామెంట్లు చేశారు.

అయితే పాత్ర మిస్ అయితే ఫీల్ అవ్వడం అనేది మానవ సహజం అని ఆమె తెలిపారు. అంతేకాదు వచ్చింది అనుకున్నది పోతే బాధ ఉంటుందని ఆమె అన్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ తో నేను ఇప్పటివరకు సినిమా చేయలేదని ఆమె తెలిపారు. కాగా టీవీలలో సీరియళ్లను చూసేవాళ్ల సంఖ్య తగ్గుతోందని యూట్యూబ్, హాట్ స్టార్ లలో చాలామంది సీరియళ్లు చూస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమాలు, సీరియళ్లలో ఎవరిని పెడితే వాళ్లకు డబ్బులు వస్తాయో వాళ్లనే పెడతారని ఆమె పేర్కొన్నారు.ఇకపోతే  జై లవకుశ సినిమాలో తారక్ చిన్నప్పటి పాత్రకు తల్లిగా చేసే ఛాన్స్ ను మిర్చి మాధవి కోల్పోయారు. భవిష్యత్తులోనైనా తారక్ సినిమాలో తారక్ తో కలిసి నటించాలని ఆమె ఆశ పడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: