కార్తీ 'విరుమాన్' ఓటిటి పార్ట్నర్ పిక్స్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  కార్తీ 'యుగానికి ఒక్కడు' మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో కార్తీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కార్తీ నటించిన అనేక తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశాడు. అందులో భాగంగా కార్తీ నటించిన ఆవారా , నా పేరు శివ , కాకి , ఖైదీ మూవీ లు తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా కార్తి 'సుల్తాన్' మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన సుల్తాన్ మూవీ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ 'విరుమాన్' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ లో మాత్రమే విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ఈ మూవీ యూనిట్ ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను లాక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి. ఈ మూవీ లో రాజ్‌కిరణ్, ప్రకాష్ రాజ్, శరణ్య తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: