సీతారామం: 5 రోజుల్లో అదిరిపోయే వసూళ్లు?

Purushottham Vinay
మలయాళం స్టార్ హ్యాండ్సమ్ హీరో 'దుల్కర్‌ సల్మాన్' హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతా రామం' సినిమాకు మంచి విడుదల అయిన మొదటి రోజే జనాల నుంచి అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది.ఇక మరి, యుద్ధంతో రాసిన ఈ ప్రేమకథ పరిస్థితి ఏమిటి ?, అలాగే ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి ?, ఇంకా అలాగే బింబిసార నుంచి వస్తున్న పోటీ ఈ సినిమాకు ఏ మేరకు ఉంది?  'సీతా రామం' 5 రోజుల వసూళ్లు ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.నైజాంలో 4.05 కోట్లు, సీడెడ్లో 2.06 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.44 కోట్లు, ఈస్ట్ లో 1.47 కోట్లు, వెస్ట్ లో 1.29 కోట్లు, గుంటూరు లో 2.01 కోట్లు, కృష్ణా లో 1.05 కోట్లు, నెల్లూరు లో 0.99 కోట్లు, తెలుగు రాష్ట్రాలైన ఏపీ ఇంకా అలాగే తెలంగాణ రాష్ట్రాలలో లో 'సీతా రామం' 5 రోజులకు గాను మొత్తం రూ. 14.66 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక మొత్తం గ్రాస్ పరంగా చూసుకుంటే..ఈ సినిమాకు 29.34 కోట్లు వచ్చాయి.అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా 0.34 కోట్లు ఇంకా ఓవర్సీస్ 0.88 కోట్లు వచ్చాయి.


టోటల్ వరల్డ్ వైడ్ గా 'సీతా రామం' సినిమా 5 రోజులకు గాను 15.88 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 31.78 కోట్లను కొల్లగొట్టింది.ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు బిజినెస్ ని చేసుకుంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రం చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇంకా లాభాలు కూడా రావడం పక్కా.పైగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఇంకా మృణాల్ ఠాగూర్ ల నటన సూపర్ అనిపించింది. ఇంకా అలాగే హీరో సుమంత్ ఇంకా భూమిక కూడా నటించారు. వీరంతా కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. మొత్తానికి బింబిసార వంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ పోటీగా వున్న కలెక్షన్స్ విషయంలో సీతా రామం సినిమా ఏ చింత లేకుండా ఆశాజనంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: