డబ్బు కోసం సుహాస్ పడ్డ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
సాధారణంగా కొంతమంది హీరోలు తక్కువ సినిమాలలోనే నటించినప్పటికీ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో హీరో సుహాస్ కూడా ఒకరు. ఈయన కలర్ ఫోటో సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా నేషనల్ అవార్డుకు ఎంపికైన సమయంలో సుహాస్ మళ్లీ తెరపైకి రావడం గమనార్హం. ఇక ఈ సినిమాతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన సుహాస్ డబ్బు కోసం తాను పడ్డ కష్టాలను కూడా వెల్లడించారు.
ఇక షోలో భాగంగా సుహాస్ మాట్లాడుతూ నేను డిగ్రీ వరకు చదివాను.  ఇక ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కింది. ఇక ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాలో అవకాశం వచ్చింది.
కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సమయంలో సందీప్ రాజు నాకు ఫోన్ చేసి చెబితే మొదట నేను ఫ్రాంక్ అనుకున్నాను. కానీ మూవీకి అవార్డు వచ్చిన రోజున మాత్రం నేను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను అని సుహాస్ తెలిపారు.. ఇక అంతేకాదు కలర్ ఫోటోలో హీరో అని చెప్పి ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేస్తే పూర్తిగా డిస్టర్బ్ అవుతానని ఇక ఆ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదని కూడా తెలిపారు.  ముఖ్యంగా కలర్ ఫోటో ఇచ్చిన సక్సెస్ వల్లే ప్రస్తుతం ఆరు సినిమాలలో హీరోగా నటిస్తున్నానని 2016 సంవత్సరంలో సినిమా అవకాశాలు లేక డబ్బు కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డాను అని ఆయన తెలిపారు.
అదే సమయంలో మా అన్నయ్య స్నేహితుడిని కలిసి డబ్బులు అడగడానికి పూర్తి స్థాయిలో మొహమాట పడ్డాను అని కూడా చెప్పు తెచ్చారు. ఇక నా అవస్థ చూసి ఆయన 500 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఇక ఆ నోటుని చూస్తూ మూడు గంటల పాటు ఏకధాటిగా ఏడ్చానని ఆయన తెలిపారు. ఇక నా నిజ జీవితంలో ఎదురైనా అనుభవాల సారాంశాన్ని కలర్ ఫోటో సినిమా ద్వారా చూపించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అంతేకాదు సినిమా అవకాశాల కోసం ఎన్నో చీత్కారాలను కూడా ఎదుర్కొన్నాను అని సుహాస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: