బయటపడ్డ అఖిల్ దుల్కర్ ల మైత్రీ బంధం !

Seetha Sailaja
యంగ్ హీరో అక్కినేని అఖిల్ సాధారణంగా ఎవరితోనూ కలవడు అని అంటారు. అందువల్లనే అతడు ఎక్కువగా ఎక్కడా బయట కనపడడు. అలాంటి రిజర్వడ్ గా ఉండే అఖిల్ మళయాళ టాప్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో చాల క్లోజ్ గా ఉంటాడట. ఈవిషయాన్ని స్వయంగా దుల్కర్ ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఈవారం విడుదల కాబోతున్న ‘సీతా రామం’ మూవీని చాల ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఈమూవీతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ హీరోగా సెటిల్ కావాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ ప్రమోషన్ కోసం ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు దుల్కర్ అనుసరిస్తున్నాడు.

ఈ పరిస్థితులలో ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుల్కర్ కొన్ని ఆశక్తికర విషయాలు తెలియచేసాడు. తనకు రకరకాల రుచులతో కూడిన డిషస్ తినడం చాల ఇష్టమని అంటూ ఈమధ్య తాను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఉలవచారు చాల ఇష్టంగా తిన్నానని చెప్పాడు. అంతేకాదు కోస్తా ప్రాంతానికి చెందిన చాల స్వీట్స్ కూడ తాను అక్కడ టేస్ట్ చేసానని అవి తనకు బాగా నచ్చాయి అంటున్నాడు. ఇక హైదరాబాద్ సంబంధించి రంజాన్ టైమ్ లో దొరికే రకరకాల హలీమ్ లు చాల ఇష్టమని ఈవిషయం ఒకసారి అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో కలిసిన అఖిల్ తో మాటవరసకు అంటే తాను షూటింగ్ లో ఎక్కడ ఉన్నా రంజాన్ నెల అంతా తనకు రకరకాల హలీమ్ లు అఖిల్ ప్రేమతో పంపిన విషయాన్ని బయటపెట్టాడు.

అంతేకాదు అఖిల్ చాల సింపుల్ గా ఉంటాడని ఎటువంటి ఇగో అతడి మాటలలో తనకు కనిపించలేదు అని అంటున్నాడు. తన మూవీని నిర్మిస్తున్న అశ్వినీ దత్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ తాను ఈసినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న రోజులలో తనను ఒక ప్రిన్స్ లా అశ్వినీ దత్ ఫ్యామిలీ చూసుకున్నారు అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: