మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో మాజీ తెలుగు హీరో..?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు .ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఇకపోతే  దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన మళ్ళీ వెండితెర మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ రచ్చ చేసారు.అయితే వరుస విజయాలతో రాకెట్ స్పీడ్ లో దూసుకు పోతున్న మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు.కాగా మహేష్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్...
 దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు..ఇక  ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.. కాగా దీంతో ఇప్పుడు చేసే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి..పోతే  11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ మాజీ హీరోకు మరో అవకాశం ఇస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. హీరో శివాజీ అందరికి తెలుసు..
అంతేకాదు  ఈయన గతంలో త్రివిక్రమ్ తీసిన జల్సా సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు..అయితే ఇక ఇప్పుడు మరోసారి ఈ హీరో కోసం త్రివిక్రమ్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను రాసుకున్నాడట.. కాగా శివాజీ పాత్ర ఈ సినిమాలో చాలా ఫన్నీగా ఉండబోతుంది అని టాక్ వస్తుంది. అయితే మరి ఇది ఎంత నిజమో తెలియదు.ఇదిలావుంటే ఈ సినిమా ఆగష్టు 15 లేదా 16 తేదీల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.. ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. కాగా హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.పోతే  ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు...!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: