అనన్య నగాళ్ల ప్రస్తుతం ఎన్ని ప్రాజెక్ట్ లలో నడుస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ అనన్య నగాళ్ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తరువాత ప్లే బ్యాక్ , వఖిల్ సబ్ మూవీ లలో కీలక పాత్రలలో నటించిన అనన్య నగాళ్ల తన నటన తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య మూవీ లలో కంటే ఎక్కువగా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును వేడెక్కిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అనగా నిన్న ఆగస్ట్ 1 వ తేదీన అనన్య నగాళ్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ముద్దు గుమ్మ తాను చేస్తున్న పలు ప్రాజెక్ట్ ల గురించి తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

అందులో భాగంగా ప్రస్తుతం అనన్య  నగాళ్ల ఏకంగా 4 ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. అరుణ్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేచింది మహిళా లోకం అనే ప్రాజెక్ట్ లో నటిస్తోంది. అలాగే జీ సంస్థ వారు నిర్మిస్తున్న బహిష్కరణ అనే ప్రాజెక్ట్ లో కూడా అనన్య నగాళ్ల నటిస్తోంది. అలాగే రవి చరణ్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 2 పేరుతో తెరకెక్కుతున్న ఒక ప్రాజెక్ట్ లో కూడా అనన్య నటిస్తుంది. వీటితో పాటు తంగం దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 2 లో తెరకెక్కుతున్న మరో ప్రాజెక్ట్ లో కూడా అనన్య నగాళ్ల నటిస్తోంది. ఇలా ప్రస్తుతం 4 ప్రాజెక్ట్ లలో నటిస్తూ అనన్య నగాళ్ల ఫుల్ బిజీ గా కెరీర్ ని కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: