ఇండ్రస్టీ లో వివక్షత పై సంచలన వ్యాఖ్యలు చేసిన జయసుధ..?

Anilkumar
అలనాటి హీరోయిన్ సహజ నటి జయసుధ తెలియని వారంటూ ఉండరు.అయితే ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే గత ఐదు దశాబ్దాల నుంచి ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ప్రస్తుతం ఆడపాదప సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ప్రస్తుతం జయసుధ తల్లి అమ్మమ్మ పాత్రలలో నటిస్తున్నారు.అంతేకాదు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ప్రస్తుత సినిమాలలో నటిస్తున్న ఈమె తన 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తిచేసుకుంది.

ఇక ఇలా తన సినీ కెరియర్ 50 సంవత్సరాలు పూర్తి కావడంతో తాజాగా ఈమె ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా జయసుధ ఇండస్ట్రీలో హీరోయిన్ల పై ఉన్న వివక్షత గురించి హాట్ కామెంట్స్ చేశారు. కాగా పక్క రాష్ట్రాలలో హీరోయిన్లకు ఉన్న వ్యాల్యూ తెలుగు హీరోయిన్లకు లేదు అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇకపోతే  ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు పనికిరారని ముంబై నుంచి వచ్చే హీరోయిన్లే బెటర్ అంటూ పెద్ద ఎత్తున వివక్షత చూపిస్తున్నారు అంటూ ఈమె కామెంట్స్ చేశారు.

అయితే ముంబై నుంచి హీరోయిన్ వస్తే చాలు ఆమె కుక్కకు కూడా స్పెషల్ రూమ్ ఇస్తారని ఈ సందర్భంగా ఇండస్ట్రీలో హీరోయిన్ విషయంలో వివక్షత చాలా ఉందంటూ వ్యాఖ్యానించారు. పోతే మాలాంటి వాళ్లకు పద్మశ్రీ అవార్డులు రావని అలాంటి వాటికి మేము పనికిరామంటూ ఈమె ఘాటుగా విమర్శలు చేశారు.అయితే  కంగనా రౌనత్ కు ఈ అవార్డు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ తనతో ప్రభుత్వానికి ఎలాంటి పని ఉందో తెలియదు అంటూ సరికొత్త వివాదానికి ఈమె తెర లేపారు.ఇక  ఇలా జయసుధ తన 50 సంవత్సరాల కెరియర్ గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదిలావుంటే ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: