ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ ను ఎవరు పట్టించుకోవడం లేదా!!

P.Nishanth Kumar
ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులందరినీ ఎంతో అలరించిన దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాతోనే ఇంతటి స్థాయిలో మెప్పించిన ఈ దర్శకుడు తప్పకుండా భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడని ప్రతి ఒక్కరు కూడా భావించారు. అయితే ఆయన తన రెండవ సినిమా చేయడానికి చాలా రోజుల సమయాన్ని తీసుకోవడం కొంతమందిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అలా మహాసముద్రం అనే సినిమాను చాలా రోజుల తర్వాత రూపొందించి విడుదల చేయగా ఆ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం ఈ దర్శకుడికి అవకాశాల కరువు ఏర్పడింది.

కారణం ఏదైనా కూడా ఈ దర్శకుడు ఎంతో మంది పెద్ద హీరోలు చెప్పిన వినకుండా మహాసముద్రం సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమా ను మొదలుపెట్టాడు. అందులో ఎలాంటి మార్పులు చేయకుండా మొండి పట్టుదలతో ఆ సినిమాను చేసి భారీ ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు. మొదటగా ఈ సినిమా కోసం రవితేజను హీరోగా అనుకోగా ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ తరువాత నాగచైతన్య హీరోగా అనుకున్నారు ఆయన కూడా చేయలేదు. చివరగా ఈ చిత్రాన్ని శర్వానంద్ చేయగా ఆ చిత్రం ఆయనకు భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టింది.

అలా ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే మూడవ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడగా ఆయన ఇంకా ఏ సినిమాను ప్రకటించక పోవడం వారికి నిరాశ నే మిగిలిస్తుందని చెప్పాలి. ఆ సినిమా యొక్క ఫలితం ప్రభావం ఈ దర్శకుడు పై చాలా ఏర్పడింది. మంచి దర్శకుడు అవుతాడు అనుకున్న వారే ఇప్పుడు ఈ మహాసముద్రం సినిమా చూసిన తరువాత ఇలాంటి సినిమా చేశాడు ఏంటి అని ఆయనను విమర్శలు చేశారు. మరి ఇప్పటికైనా ఓ మంచి కథతో ప్రేక్షకులను అలరించే సినిమాతో ఆయన వచ్చి మరొకసారి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇప్పుడు ఆయన తన తదుపరి సినిమాను ఏ హీరోతో చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: