ఇకనైనా వారిని శృతిహాసన్ వదిలేస్తుందా..?

Divya

సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతిహాసన్. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకుల మధ్య స్టార్ హీరోయిన్గా ఎదిగింది. మొదట లక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్లో హీరోయిన్గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో శృతిహాసన్ ఆ తర్వాత తెలుగు, తమిళ భాషలలోనే సినిమాలు చేసింది కానీ అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో శృతిహాసన్ కు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను మూటగట్టుకుంది. ఇక శృతిహాసన్ కెరియర్ చాలా కష్టమే అనుకుంటున్నా సమయంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది ఇక 2015లో విడుదలైన శ్రీమంతుడు సినిమాలో చివరిగా శృతిహాసన్ నటించింది. ఇక తర్వాత దాదాపుగా 5 ఏళ్ళ పాటు  కనిపించలేదు అయితే మళ్లీ క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని కం బ్యాక్ ఇచ్చింది శృతిహాసన్. ఆ వెంటనే పవన్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలతో కూడా నటించేందుకు సై అంటోంది.
ఇక ఈమె కు సీనియర్ హీరోలతో నటించేందుకు భారీగానే రెమ్యునరేషన్  ఇస్తున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరోలతో శృతిహాసన్ నటించడానికే ఎక్కువ మక్కువ చూపుతోంది అని వార్తలు కూడా ఇండస్ట్రీలో టాక్ గా వినిపిస్తున్నాయి. ఆకట్టుకొనే అందం ఉన్నప్పటికీ మంచి సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు .. కేవలం సీనియర్ హీరోలతోనే నటించడం వల్ల ఆమె అభిమానులు ఏమాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే తన తండ్రి వయసుతో ఉన్న హీరోలతో వెతకట్టడం కంటిన్యూ చేస్తే ఈమె క్రేజీ పడిపోతుంది అని అభిమానులు సైతం కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఇక  శృతిహాసన్ ఈ సీనియర్ హీరోలతో నటించే అవకాశాలను వదిలేస్తుందో లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: