సలార్ కి ధమ్కీ ఇవ్వాలా.. ఫ్యాన్స్ ఆలోచన!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  వాటిలో ముందుగా సలార్ చిత్రాన్ని పూర్తి చేసే విధంగా ప్లాన్ చేశాడు ఈ హీరో. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా ఈ చిత్రం ఇంకా పూర్తి కాకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశప రుస్తుంది. వరుసగా రెండు భారీ క్లబ్ సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయిన ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు.

అయితే ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులు అవుతున్న కూడా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇవ్వకపోవడం ఆయన అభిమానులకు ఎంతగానో ఆగ్రహం కలిగిస్తుంది. అసలే ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అన్న ఆవేశంలో ఉన్న వారికి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా ఇవ్వకపోవడం పుండు మీద కారం చల్లినట్లు అవుతుంది. గతంలో అప్డేట్లు ఇవ్వని కారణంగా రాధే శ్యామ్ చిత్రం నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ వారి పై భారీ స్థాయిలో త్రోల్స్  చేశారు ప్రభాస్ అభిమానులు. 

అలా త్రొల్స్ చేసిన కారణంగా వెంటనే రాధే శ్యామ్ కు సంబంధించిన అప్డేట్లను ఇవ్వడం మొదలుపెట్టారు ఇప్పుడు కూడా ఈ సిని మా యొక్క నిర్మాణ సంస్థ హోం బలే సంస్థను టోన్స్ చేస్తే తప్పకుండా అప్డేట్లు ఇస్తారనే భావనకు అభిమానులు వచ్చినట్లుగా తెలుస్తుంది త్వరలోనే ఈ చిత్ర నిర్మాణ సంస్థ పై వా రు చేయనున్నారని తెలుస్తుంది. మరి ఇంకా మొదలుపెట్టని ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టి ముందుకు తీసుకు వస్తారో చూ డాలి. ఈ సిని మాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో అలరించడం ఖాయం అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: