మెగాస్టార్ రిజెక్ట్ చేసిన కథతో రికార్డులు సృష్టించిన రజినీకాంత్..?

Anilkumar
ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ నటీనటులు సైతం కొన్ని కథలను రిజెక్ట్ చేస్తూ ఉండడం సర్వ సాధారణం.అయితే మరి కొంతమంది రిజెక్ట్ చేసిన కథలతోనే పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు.ఇక ఆ తర్వాత ఆ సినిమా ఎందుకు వదులుకున్నామని చాలా బాధపడిన సందర్భాలను.. కొంతమంది నటీనటులు తెలియజేయడం మనం చూసే ఉన్నాము. అయితే ఇక  ఇప్పుడు స్టార్ హీరో రిజెక్ట్ చేసిన ఒక స్టోరీ తో రజనీకాంత్ పలు రికార్డులను క్రియేట్ చేశారు. పోతే ఆ సినిమా గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.కాగా మలయాళం సూపర్ స్టార్ సురేష్ గోపి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం మణిచిత్ర తాల్.. 

ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించినది.అయితే  ఈ చిత్రం 1993లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. ఇక ఈ చిత్రాన్ని రీమిక్ గా 2014లో కన్నడలో ఆప్తమిత్ర అనే సినిమాని తెరకెక్కించడం జరిగింది. కాగా ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్గా నటించినది. అయితే ఈ చిత్రంలో విష్ణువర్ధన్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమా కూడా ఘనవిజయాన్ని అందుకుంది.అయితే ఇదంతా ఇలా ఉండగా ఇదే సినిమాను తమిళంలో రజినీకాంత్ హీరోగా చంద్రముఖి అనే టైటిల్తో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా లో ప్రభు పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు రజినీకాంత్. ఇకపోతే  ఈ సినిమాలో జ్యోతిక, నయనతార కథానాయకులుగా నటించారు.

అంతేకాకుండా ఈ సినిమా మొదట నాగవల్లి అని టైటిల్ ని కూడా అనుకున్నారు కానీ రజనీకాంత్ చంద్రముఖి అనే టైటిల్ ని సూచించడంతో ఈ సినిమా టైటిల్ ని మార్చడం జరిగింది. ఇకపోతే 2005వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా రికార్డులను సైతం సృష్టించింది.అయితే  ఇక ప్రేక్షకులు థియేటర్లో జ్యోతిక నటనకు భయపడిపోయారని చెప్పవచ్చు.కాగా ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. అయితే ఇక డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఈ సినిమా చూడాలని ముందుగా చిరంజీవికు సిడి పంపించారట.  ఈ సినిమాను చిరంజీవి చూసి రిజెక్ట్ చేశాడు కానీ చంద్రముఖి విడుదలైన తర్వాత చిరంజీవి ఆదిత్య కు ఫోన్ చేసి అభినందించారంట .ఇక అలా చిరంజీవి కథతో రజినీకాంత్ పలు రికార్డులను సృష్టించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: