బాడీ షేమింగ్.. వర్షని బుల్లెట్ భాస్కర్ కి ఎంత మాటన్నాడు?

praveen
బాడీ షేమింగ్.. ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. నీ ముక్కు సరిగా లేదు.. నీ పెదాలు సరిగ్గా లేవు..  నీ నడుం సరిగ్గా లేదు అంటూ మమ్మల్ని ఎంతో మంది డైరెక్టర్లు బాడీ షో మీ చేశారు అంటూ ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ధైర్యంగా తెరమీదికి వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక బాడీ షేవింగ్ వల్ల తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము అంటూ ఎంతో మంది చెప్పుకొచ్చారు. ఇటీవల వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఇలాంటి కామెంట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లాంటి కార్యక్రమాలలో ఇలాంటి కామెంట్లు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.

 జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అనేక కార్యక్రమాలలో ఒక వ్యక్తి రూపాన్ని హేళన  చేస్తూ పంచులు వేసి చివరికి కామెడీ పంచడానికి ఎక్కువమంది కమెడియన్లు ప్రయత్నిస్తున్నారని ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా అమ్మాయిల పైనే బాడీ షేమింగ్ ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం జబర్దస్త్లో లేడీ కమెడియన్గా  కొనసాగుతున్న రోహిణి పై దున్నపోతు బర్రె ఆంబోతు అంటూ ఇలా ఎన్నో సార్లు లావుగా ఉండడం పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం కూడా చూశాము.

 ఇక ఇటీవలే రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో కూడా బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ వర్షని ఉద్దేశించి బాడీ షేమింగ్ కామెంట్ చేయడం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. స్కిట్ లో భాగంగా నన్ను యాంకర్ అంటే ఎవరూ నమ్మడం లేదు అంటూ రష్మి చెబుతుంది. అంతలో కల్పించుకున్న బుల్లెట్ భాస్కర్ దీన్ని అమ్మాయి అంటేనే ఎవరూ నమ్మడం లేదు అంటూ పంచు వేస్తాడు. అంతేకాదు శాంతి స్వరూప్  ఏమో అని వర్షను చూసి అనుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తే అక్కడున్న జడ్జీలు కూడా పగలబడి నవ్వారు అని చెప్పాలి. గతంలో కూడా విష్ణు ప్రియ ముక్కు పై ఎన్నో బాడీ షేమింగ్ కామెంట్ చేయడం కూడా చూశాము.  ఇది చూసిన తర్వాత ఇలాంటి కామెడీతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది ప్రేక్షకులు  ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: