పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు.. ఈ విషయం తెలుసా?

praveen
అలనాటి హీరోలలో ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. అప్పట్లో అమ్మాయిలకు అందాల రాకుమారుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సోగ్గాడుగా శోభన్ బాబు ప్రస్థానం కొనసాగించారు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు హీరోలుగా రాణించిన వారు ఆ తర్వాత వివిధ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొనసాగారు. కానీ తనను తాను ప్రేక్షకులకు ఎప్పటికి సోగ్గాడి గానే ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇక వయసు మీద పడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించకుండా సినిమాలకు దూరం గానే ఉన్నాడు. అయితే ఇక శోభన్ బాబును మళ్లీ సినిమాల్లో నటింప చేయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు.

 కానీ ఆఫర్లను కూడా ఎంతో సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు శోభన్ బాబు. అయితే పవన్ కళ్యాణ్, శోభన్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉందట. కానీ వీరి కాంబినేషన్ క్యాన్సిల్ అయింది. పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ భీమిలి శ్రీనివాస్ దర్శకత్వంలో ఇచ్చిన చిత్రం సుస్వాగతం. ఈ సినిమా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ కు పవన్ కళ్యాణ్ ని దగ్గర చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి. ఈ పాత్రలో ప్రముఖ నటుడు రఘువరన్ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే వాస్తవానికి ఈ పాత్రను రఘువరన్ పోషించాల్సినది కాదట.

 ముందుగా ఈ పాత్ర కోసం దర్శకుడు శోభన్ బాబు ను అడిగారట. కానీ అప్పటికే వయసు మీద పడిన నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి శోభన్బాబు తాను నటించలేను అంటూ దర్శకనిర్మాతలకు చెప్పేశారట. తనను ప్రేక్షకులు ఎప్పుడూ సోగ్గాడి గా అందంగా ఉండే శోభన్బాబు గానే గుర్తుపెట్టుకోవాలని వయసు మీద పడిన తర్వాత సినిమాలకు గుడ్ పై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆ దర్శక నిర్మాతలకు ఖరాఖండీగా చెప్పేశాడట శోభన్ బాబు. శోభన్బాబు రిజక్ట్ చేయడంతో చివరికి ఆ పాత్ర రఘువరన్ దగ్గరికి వెళ్లిందట. ఈ పాత్రలో రఘువరన్ ఎంతో ఒదిగిపోయి నటించి ప్రేక్షకులను మెప్పించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: