ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేరు దేశావ్యాప్తంగా మార్మోగుతోంది.ఇక ఏ సోషల్ మీడియా సైట్లో చూసిన ఆయన లెటేస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైతే న్యూడ్ ఫోటోషూట్ చేసి ఫోటోస్ ఆన్లైన్లో షేర్ చేశారో అప్పటి నుంచి రణ్‌వీర్‌సింగ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.ఒంటిపై అసలు నూలుపోగు కూడా లేకుండా పేపర్ మ్యగజైన్ కోసం ఫోజులిచ్చిన విషయం తెలిసిందే.1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా ఈ బాలీవుడ్ నటుడు ఈ ఫొటోషూట్ చేశారు.ఈ ఫోటోలు అయితే నెట్టింట్లో సంచలనంగా మారాయి. దీనిపై నెటిజన్లు నుంచి కూడా భిన్నమైన స్పందన లభిస్తోంది. 'సూపర్ హాట్' అంటూ రణ్వీర్ కోస్టార్స్ ఇంకా అభిమానులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ నటుడి బోల్డ్ ఫోజులపై అనేక సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ సైతం పుట్టుకొచ్చాయి.
మరోవైపు ఈ ఫోటోషూట్‌పై వివాదాలు ఇంకా అలాగే విమర్శలు కూడా చుట్టుముట్టాయి. అయితే తాజాగా నగ్న షోటోషూట్ నటుడిని చట్టపరమైన చిక్కుల్లో పడేసింది.ఓ ఎన్జీఓ ఫిర్యాదు మేరకు రణ్వీర్ సింగ్‌పై ముంబైలో చెంబూర్ పోలీస్ స్టేషన్లో కేసు అనేది నమోదైంది.ఈయన మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక అంతకుముందు.. రణ్వీర్ సింగ్ కు చాలా మంది సెలబ్రిటీలు మద్దుతు ఇస్తుండటంతో.. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్సీ ఎంపీ ఇంకా బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు. ఒకవేళ మహిళ ఫోటోషూట్ చేస్తే ఇప్పటికే ఆమె ఇంటిని తగలబెట్టే వారని, లేదా తనను ఇక చంపేస్తామని బెదిరించేవారని పేర్కొన్నారు. కాగా రణ్వీర్ సింగ్ కంటే ముందు విజయ్ దేవరకొండ, తరువాత విష్ణు విశాల్ సైతం న్యూడ్ ఫోటోలకు పోజులిచ్చి పెద్ద హాట్ టాపిక్‌గా మారారు.