ఈ వారం 'ఓటిటి' ప్లాట్ ఫామ్ లలో విడుదల కాబోయే సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని మూవీ లు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అలా ఈ వారం 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉన్న మూవీ ల గురించి తెలుసుకుందాం.


ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాకెట్రీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 26 వ తేదీ నుండి తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది. ఈ మూవీ కి థియేటర్ లలో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.  ది బ్యాట్ మాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ జూలై 27 వ తేదీ నుండి ఇంగ్లీష్ తో పాటు తెలుగు , హిందీ , తమిళ్ ,  మలయాళం , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది. 777 చార్లీ సినిమా జూలై 29 వ తేదీ నుండి వూట్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది. ఈ మూవీ కి థియేటర్ లలో మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఈ మూవీ కి మంచి ప్రశంసలు దక్కాయి.  19 (1) (a) మూవీ జూలై 29 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్  'ఓ టి టి' లో మలయాళ భాషలో స్ట్రీమింగ్  కావడానికి రెడీ గా ఉంది. జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గుడ్ లక్ జెర్రీ సినిమా జూలై 29 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హిందీ భాషలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది. ఇలా ఈ వారం ఈ మూవీ లు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: