అనన్యా నాగళ్ల.. హృదయాలను గిలిగింతలు పెట్టేలా..!

shami
మల్లేశం సినిమా లో నటించిన అనన్యా నాగళ్ల ఆ తర్వాత ప్లే బ్యాక్ అనే మూవీ కూడా చేసింది. అయితే ఈ రెండు సినిమాల తో రాని క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన వకీల్ సాబ్ సినిమాలో అమ్మడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆ సినిమా లో అంజలి, నివేదా థామస్ లతో కలిసి నటించిన అమ్మడు వకీల్ సాబ్ తో సూపర్ పాపులర్ అయ్యింది. వకీల్ సాబ్ వల్ల మంచి ఐడెంటిటీ తెచ్చుకున్న అనన్యా నాగళ్ల తనకు వచ్చిన ఈ పాపులారిటీ ని మరింత పెంచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అమ్మడి గ్లామర్ ఎటాక్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటున్నాయి.
అనన్యా నాగళ్ల తన ఫోటో షూట్స్ తో సత్తా చాటుతుంది. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ టార్గెట్ గా అమ్మడి ఫోటో షూట్స్ ఉంటున్నాయి. తనలోని గ్లామర్ సైడ్ ని.. తన అందాలకి పనిచెబుతూ అమ్మడు అదరగొట్టేస్తుంది. ఆల్రెడీ అంతకుముందు రకరకాల ఫోటో షూట్స్ తో అదరగొట్టిన అమ్మడు లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది. అనన్యా లేటెస్ట్ ఫోటో షూట్ కుర్రాళ్లని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తుంది. అమ్మడు చేస్తున్న ఈ అందాల ప్రదర్శన ఆమెకు మంచి మైలేజ్ ఇస్తుందని చెప్పొచ్చు. అదిరిపోయే అందాల ప్రదర్శన.. అదే రేంజ్ లో ఓర చూపులతో అమ్మడు పిచ్చెక్కేలా చేస్తుంది.
తన గ్లామర్ సైడ్ ఓ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తున్న అనన్యా సరైన ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీ అని హింట్ ఇస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మడు తన దగ్గరకు వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న అమ్మడు సోలో హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తుంది. మరి అనన్యాకి అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: