ది వారియర్: ఆచార్య కంటే పెద్ద ఫెయిల్యూర్?

Purushottham Vinay
ఇక `ఇస్మార్ట్ శంకర్‌` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్న టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. `రెడ్‌` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా సరే హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో `ది వారియర్‌` వంటి మరో మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తే.. ఆది పినిశెట్టి ఇందులో విలన్‌గా చేశాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీపై రామ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ది వారియర్‌ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావించాడు.కానీ, ఆయన ఆశలు పూర్తిగా గల్లంతు అయ్యేలానే ఉన్నాయి. జూలై 14న తెలుగు ఇంకా తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన దక్కించుకుంది.


దానికి తోడు టికెట్ రేట్స్ కూడా హైగా ఉండటంతో.. కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం కూడా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా రూ. 38.10 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 39.00 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది.అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 17.90కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టగలింది. వీకెండ్ వరకు బాగానే పర్ఫామ్ చేసినా కూడా వర్కింగ్ డేస్‌లో ఈ మూవీ బాగా వీకైంది. ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వాలంటే రూ. 22 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, అది దాదాపు అసాధ్యమే కాబట్టి ది వారియర్‌ సినిమాతో రామ్‌కు డిజాస్టర్ ఖాయమని అంటున్నారు.అలాగే ఇప్పుడు  ఆక్యూపెన్సి కూడా 20-25% మాత్రమే వుంది. ఇక తెలుగులో 15 కోట్లకు పైగా నష్టాలు తప్పేలా లేవట. చూస్తుంటే ఈ ఏడాది నష్టాల్లో ఆచార్య సినిమాని మించిపోయేలా వుంది రామ్ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: