ఆ టాలీవుడ్ క్రేజీ బ్యానర్ లో స్ట్రేట్ తెలుగు సినిమా చేయనున్న సూర్య..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినా సూర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సూర్య , మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన గజిని మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి ఆ మూవీ తో టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా , ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు .

ఆ తర్వాత నుండి సూర్య తను నటించిన దాదాపు అన్ని మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి తెలుగు ఇండస్ట్రీ లో కూడా సూపర్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు . ఇలా తెలుగు లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య ఇప్పటి వరకూ తన కెరియర్ లో నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించ లేదు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆదుకున్న సమాచారం ప్రకారం త్వరలోనే సూర్య నేరుగా ఒక తెలుగు మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది . తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినా యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు సూర్య హీరోగా ఒక స్ట్రీట్ తెలుగు మూవీ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కి దర్శకత్వం వహించబోయే దర్శకుడు ఎవరు అనేది ఇంత వరకు కన్ఫామ్ కానట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి దర్శకత్వం వహించే దర్శకుడి పేరుని మరియు ఇతర నటీ నటులు , సాంకేతిక నిపుణుల గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: