'గజిని' సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
స్టార్ హీరో మాధవన్ గురించి మనకి తెలిసిందే. ఇకపోతే మాధవన్ హీరోగా ఇటీవలే విడుదలైన ‘రాకేట్రి’ సూపర్ హిట్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే ఈ మూవీ అంచనాలకు మించి సక్సెస్‌ సాధించడంతో మాధవన్ ఫుల్ ఖుషి అవుతున్నాడు.ఇకపోతే  మాధవన్ తన సినిమా సక్సెస్ అయిన సందర్భంగా హీరో సూర్యతో ఒక వీడియో చాట్‌లో పాల్గొన్నాడు. కాగా ఇదే చాట్‌లో సూర్య, మాధవన్ రకరకాల విషయాలు గురించి చర్చించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే మాధవన్‌ ఒక సంచలన నిజం బయట పెట్టాడు. అయితే దాంతో అందరూ అవాక్కవుతున్నారు.

ఇదిలావుంటే “సూర్య నటించిన గజినీ సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఇకపోతే  ఈ మూవీలో హీరోగా చేసే ఆఫర్ ఫస్ట్ నాకే వచ్చింది, కానీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను.అయితే  గజినీ సినిమా డైరెక్టర్ మురుగుదాస్ నాకు కథ వినిపించినప్పుడు సెకండఫ్ నాకు కనెక్ట్ అవలేదు. ఇకపోతే తరువాత ఆ కథ సూర్య చెంతకు చేరింది. ఆ క్యారెక్టర్ లో మిమల్ని చూసాక నేను చాలా సంతోషించాను....” అని మాధవన్ పేర్కొన్నాడు. గజినీ క్యారెక్టర్‌లో సూర్య చాలా బాగా నటించారని…ఇక  ఆ క్యారెక్టర్‌కు సూర్యకి సరిగ్గా సెట్ అయిందని మాధవన్ చెప్పుకొచ్చారు. ఇకపోతే గజినీ పాత్రలో నటించడం చాలా కష్టమని..

సిక్స్ ప్యాక్ వెనుక ఉన్న కష్టాన్ని తాను అర్థం చేసుకోగలం అని అన్నారు.ఇదిలావుంటే మాధవన్ సూర్యని ఉద్దేశిస్తూ.. “మిమ్మల్ని సంజయ్ రామస్వామి పాత్రలో చూశాక నా సినిమాలకి, నా కెరీర్‌కు నేను న్యాయం చేయలేకపోతున్నానని అనుకున్నాను. ఇకపోతే గజినీ తరువాతనే మీ తలరాత మారిపోయింది. అయితే ఇండస్ట్రీలో నాకు ఉన్న మంచి స్నేహితుల్లో నువ్వు, జ్యోతిక ప్రథమ స్థానంలో ఉంటారు.అంతేకాదు మీతో సమయం గడిపిన తరువాత స్నేహం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇకపోతే నాకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీరు నాకు తోడుగా వుంటారు” అంటూ ఆయన  చెప్పుకొచ్చాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: