సత్యదేవ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
ప్రామిసింగ్ యాక్టర్ సత్యదేవ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ అనేక వైద్యపరమైన సినిమాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అలా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏర్పరచుకున్న సత్యదేవ్ తన కెరియర్ లో బ్లాఫ్ మాస్టర్ , ఉమా పరమేశ్వర ఉగ్ర రూపస్య లాంటి డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

ఇలా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సత్యదేవ్ గత కొంతకాలంగా నటించిన సినిమాలు మాత్రం పెద్దగా విజయాలను సాధించలేక పోతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సత్యదేవ్ 'గాడ్సే' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇలా గాడ్సే సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని ఎదుర్కొన్న సత్యదేవ్ తాజాగా నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టైటిల్ ను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.  కృష్ణమ్మ అనే టైటిల్ తో సత్యదేవ్ తాజా సినిమా రాబోతోంది.

చిత్ర బృందం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్య దేవ్ ఒక నది దగ్గర కత్తిని పట్టుకొని నిల్చొని ఉన్నాడు. ఎర్రటి పోస్టర్ మరియు టైటిల్ డిజైన్ పోస్టర్ చూస్తుంటే ఈ మూవీ యాక్షన్ డ్రామా మూవీ అని తెలుస్తోంది. మిర్చి , శ్రీమంతుడు ,  జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను ,  ఆచార్య మూవీ లకు దర్శకుడు గా వ్యవహరించిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ మూవీ ని సమర్పిస్తున్నాడు.  అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ మూవీ ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 2022 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: