ఆ ఇద్దరు మెగా హీరోలపై దృష్టి పెట్టిన సంతోష్ శ్రీనివాస్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొంత మంది దర్శకులు మాత్రం ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మొదటి సినిమా తోనే దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకోవడం లో కొంత మంది దర్శకులు చాలా స్లో అవుతూ ఉంటారు.

అలాంటి వారిలో సంతోష్ శ్రీనివాస్ ఒకరు. సంతోష్ శ్రీనివాస్, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన కందిరీగ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను కూడా తీసుకువచ్చింది. ఆ తర్వాత ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రభస మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా హైపర్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమాలను తెరకెక్కించాడు.

ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా కెరియర్ లో దర్శకత్వం వహించిన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటున్నాడు. ఇది ఇలా ఉంటే  సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం ఇద్దరు మెగా హీరోలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ,  పంజా వైష్ణవ్ తేజ్ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. కాకపోతే ఇప్పటికే సాయి ధరమ్ తేజ్,  పంజా వైష్ణవ్ తేజ్ ఇద్దరూ కూడా తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి సంతోష్ శ్రీనివాస్ తో సినిమా ఎప్పటికీ సెట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: