చిన్న నిర్మాతలకు నష్టాలు తప్పేలా లేవు ?

VAMSI
ఒకప్పుడు అంటే 100 రోజులు 200 రోజులు సినిమాలు ఓ తెగ ఆడేవి.. కానీ ఇప్పట్లో ఈ లెక్క పూర్తిగా మారింది.
ఎంత తోపు అనిపించుకున్నా మహా అయితే ఓ 50, 60 రోజులకు మించి థియేటర్లలో నిలబడటం లేదు. ఏదో ఒకటి రెండు చిత్రాలు ఈ మార్క్ ను దాటుతున్నాయే తప్ప ఆల్మోస్ట్ అన్ని చిత్రాలు రిలీజ్ అయిన  కొద్ది రోజులకే ఓ టి టి లోకి వచ్చేస్తున్నాయి.  ఇక నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం వారం పది రోజులకే ఓ టి టీ లో ప్రత్యక్షమైపోతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఓ టి టీ ల సందడి కరోనా పీరియడ్ లోనే మొదలయ్యింది.
అప్పటి వరకు వీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కానీ లాక్ డౌన్ టైం లో ప్రేక్షకులు ఈ ఫ్లాట్ ఫామ్ కి బాగా అలవాటు పడ్డారు.
థియేటర్లో ఆడియెన్స్‌ తో ఎంత రచ్చ చేయించిన సినిమాలైనా ఎక్కువ రోజులు థియేటర్లలో నిలవడం లేదు అన్నది వాస్తవం. కాకపోతే సూపర్ హిట్ అనిపించుకుంటే మాత్రం మరో 20 రోజులు ఎక్కువగా ఆడుతున్నాయి.  ఇటీవల జూన్ 17 న రిలీజ్ అయిన సినిమా విరాటపర్వం కూడా ఓ టి టీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. జూలై ఒకటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది అంటే రిలీజైన 14 రోజులకే ఓ టి టి లోకి అన్నమాట. సాయిపల్లవి, రానా కలిసి నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.  నాని, నజ్రియా జంటగా వచ్చిన అంటే సుందరానికి కూడా ఇదే బాటలో ఉంది. జూన్ పదిన థియేటర్లలోకి ఎంతో ఘనంగా వచ్చిన ఈ సినిమా కూడా జూలై ఎనిమిదిన ఓటీటీ లో స్ట్రీమ్ అవనుందని డేట్ ను ఫిక్స్ చేసేసారు.
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు రాదేశ్యామ్, ఆచార్య సినిమాలు కూడా రిలేజ్ అయిన 40, 50 రోజులకే ఓ టి టి బాట పట్టాయి అన్నది తెలిసిందే. కమల్ హాసన్ సినిమా విక్రమ్ మాత్రం ఫుల్ పాజిటివ్ టాక్ తో బజ్ క్రియేట్ చేసి జూన్ 3 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అయితే జూలై ఎనిమిదిన హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు అయిపోయింది. ఇలా ఎంత పెద్ద చిత్రం అయినా ఎంతటి ఘన విజయం సాధించిన ఓ టి టి ల కారణంగా థియేటర్ లలో ఎక్కువ కాలం నిలబడటం లేదు. అయితే తాజాగా 50 రోజులు ఆడిన తర్వాతనే ఓ టి టి లోకి రావాలి నిబంధన తెరపైకి వచ్చినా అది ఇంకా వాస్తవ రూపం దాల్చలేదు. ఇది కనుక వర్క్ అవుట్ కాకపోతే కోట్లు పెట్టి సినిమాలు తీసిన చిన్న నిర్మాతలకు నష్టాలు తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: