రూమర్స్ కి చెక్ పెట్టిన రాశీ ఖన్నా.. అలా చేయలేదంటూ..?

Divya
రాశీ ఖన్నా.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత హీరో గోపీచంద్ తో చేసిన జిల్ మూవీ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుని.. ఇప్పుడు మరోసారి అదే హీరోతో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమా మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలకు సంబంధించి మరో అప్డేట్ కూడా తాజాగా వచ్చిన విషయం తెలిసింది . ఇక ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
2020 సంవత్సరం చివర్లో వెంకీ మామ సినిమా తో పాటు ప్రతి రోజు పండగే లాంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక తాజాగా ఈమె విక్రమ్ కుమార్ డైరెక్షన్లో నాగచైతన్యతో కలిసి నటించిన థాంక్యూ సినిమా జూలై 8 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉండగా కానీ అనూహ్యంగా ఈ సినిమాను జూలై 22వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు నిర్మాతలు..అలాగే మారుతి డైరెక్షన్ లో  గోపీచంద్ తో కలిసి నటించిన పక్కా కమర్షియల్ సినిమా కూడా జూలై 1 వ తేదీన విడుదలకు సిద్ధం గా ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగంగా టీమ్ అంతా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో రాశీ ఖన్నా లాయర్ పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగానే ఇప్పటివరకు తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది రాశిఖన్నా.. గతంలో రాశిఖన్నా దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ తాను వ్యాఖ్యలు చేసిందని పెద్దఎత్తున ఆమెపై రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ వీటిపై ఆమె స్పందిస్తూ భాష ఏదైనా.. సినిమా ఏదైనా తాను చేసే ప్రతి సినిమాపై కూడా తనకి  గౌరవం , మర్యాద అనేది ఉంటుందని తెలిపింది .ఇక దయచేసి ఇటువంటి ప్రచారాలను ఇకనైనా ఆపండి అంటూ ఆమె రూమర్స్ కి చెక్ పెడుతూ వివాదానికి ముగింపు పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: