దేవి వారియర్ గా అదరగొడుతున్నాడుగా..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ఇటీవల కాలంలో ఆయ న సంగీతం అందించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం అంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి గల కారణలలో దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా ఒకటి అని చెప్పవచ్చు. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులను తన సంగీతంతో ఎంతగానో అలరించిన దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు కూడా మరి కొన్ని సినిమాలతో ప్రేక్షకులను భారీస్థాయిలో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

ఆ విధంగా రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ చిత్రానికి ఆయన సంగీతాన్ని అందిస్తుండగా ఇందులో నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాటలు వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తుండగా తాజాగా విడుదలైన విజిల్ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. దాంతో దేవిశ్రీప్రసాద్ మరోసారి మ్యాజిక్ చేశాడని అంటున్నారు. 

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో తమన్ హవా నడుస్తుంది. వీరిద్దరి పోటీలో తమ పై చేయిగా వ్యవహరించే వారు. పెద్ద హీరోలు అందరూ కూడా తమ తో పనిచేయాలని చూసేవారే దాంతో దేవిశ్రీప్రసాద్ క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది అయితే పుష్ప సినిమా లోని పాటలతో మళ్ళీ దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ చేశాడనే చెప్పాలి. ఆ చిత్రం అందరినీ ఆకట్టుకున్న దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలకు విశేషమైన స్పందన దక్కింది.  ఇప్పుడు ఈ వారియర్ సినిమాతో మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు. ఏదేమైనా దేవిశ్రీ అభిమానులు ఇప్పుడు ఆయన కం బ్యాక్ చేసిన విధానాన్ని చూసి ఎంతో ఆనంద పడుతున్నారు.  మరి దేవిశ్రీ ప్రసాద్ జోరు ఇదే స్థాయి లో కొనసాగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: