అనసూయ పక్కా కమర్షియల్... అలాంటి పాత్రలు అస్సలు చేయదు... మారుతి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ ఇమేజ్ కలిగి ఉన్న హీరోలలో ఒకరు అయిన గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా, ఈ మూవీ కి మారుతి దర్శకత్వం వహించాడు .

ఈ మూవీ ని జులై 1 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే పక్క కమర్షియల్ సినిమా నుండి కొన్ని పాటలను,  టీజర్ ,  ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా గోపీచంద్ మరియు మారుతి ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు గెస్ట్ గా వెళ్లారు.

అందులో భాగంగా దర్శకుడు మారుతి ఈ షో కు పక్కా కమర్షియల్ యాంకర్  అనసూయ ను కలుద్దామని వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే అనసూయ పక్కా కమర్షియల్ అని చిన్న చిన్న పాత్రలు ఇచ్చిన చెయ్యదు అని నవ్వుకుంటూ సరదాగా చెప్పాడు. ఇది ఇలా ఉంటే పక్క కమర్షియల్ మూవీ లో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో రావు రమేష్ , సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు.  ఇప్పటికే సిటీ మర్ సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్న గోపీచంద్ 'పక్క కమర్షియల్' మూవీ తో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: