'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. గెస్ట్ గా ఆ స్టార్ హీరో..?

Anilkumar
మ్యాచో హీరో గోపిచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో మనకి తెలియంది కాదు.అయితే తాజాగా గోపిచంద్  ప్రధాన పాత్రలో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ .ఇకపోతే ఈ సినిమా  గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇదిలావుంటే ఇందులో గోపిచంద్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.కాగా కామెడీ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో రాశిఖన్నా, గోపిచంద్ ఇరువురు లాయర్లుగా కనిపించబోతున్నారు.

ఇకపోతే  ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.అయితే  పక్కా కమర్షియల్ టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. కాగా ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూలై 1న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.ఇకపోతే  ఈ సినిమా ప్రఙమోషన్స్ స్పీడ్ పెంచింది.ఇదిలావుంటే  తాజాగా పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

అంతేకాకుండా  లేటేస్ట్ సమాచారం ప్రకారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తుంది.పోతే  కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే  ఈ మూవీలో సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడానికి రెడీ అయ్యారు రాశీ. ఇకపోతేఈమె కారెక్టర్ ఎంత ఫన్నీగా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించారు.. కాగా ఈ సినిమాలో సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.అయితే  SKN సహ నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: