దళపతి విజయ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
కోలీవుడ్ టాప్ హీరో ఇళయ దళపతి విజయ్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విజయ్ ఆ తర్వాత తన తొలి సినిమాతోనే యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ కోలీవుడ్ లోనే అగ్రహీరోగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న విజయ్ తన సినీ కెరీర్లో ఎన్నో కష్టాలు కూడా పడ్డాడని తెలుస్తోంది. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ సినిమాలో నటించగా.. ఆ సినిమాలో తన ఎక్స్ప్రెషన్స్ పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో విజయ్ చాలా అవమానాలు ఎదుర్కొన్నారట. పైగా అతను ఇక సినిమాలకు పనికిరాడని తేల్చి చెప్పేశారట.

కానీ విజయం మాత్రం తన సహనాన్ని కోల్పోకుండా ముందుకు అడుగు వేసి తన టాలెంట్ తో హీరోగా ఎదిగాడు. ఇక కోలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన తరువాత విజయ్ రేంజే మారిపోయింది. తన నటనతో వరుస సక్సెస్ లు అందుకొని పలు అవార్డులు కూడా అందుకున్నాడు. ఇక తుపాకి,స్నేహితుడు, పోలీసోడు, సర్కార్, అదిరింది, విజిల్, మాస్టర్, బీస్ట్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుని ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. నిజానికి ఈ హీరో సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతూ ఉంటుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సమయంలోనే..

విజయ్ కూడా అగ్ర హీరోగా ఎదిగి వారి కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. పైగా ఇప్పుడున్న కోలీవుడ్ అగ్ర హీరోలలో రెమ్యునరేషన్ విషయంలో విజయ్ ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం దళపతి విజయ్ రెమ్యునరేషన్ 90 నుంచి 100 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం వినిపిస్తోంది. కానీ విజయ్ తన కెరీర్ మొదట్లో అందుకున్న మొదటి పారితోషికం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తమిళంలో విజయ్ బాలనటుడిగా 'వెట్రి' అనే సినిమాలో నటించగా ఆ సమయంలో విజయ వయస్సు పదేళ్ళు. కాగా ఆ సినిమాకు విజయ్ 500 రూపాయలు తన మొదటి పారితోషికంగా అందుకున్నాడు. అంత తక్కువ రెమ్యునరేషన్ నుంచి ఇప్పుడు వందల కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడు అంటే అది మామూలు విషయం కాదని ఆయన అభిమానులు విజయ్ ని తెగ పొగిడేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: