'పక్కా కమర్షియల్' మూవీలో అలా కనిపించనున్న రాశి కన్నా..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన రాశి కన్నా తాజాగా పక్కా కమర్షియల్ మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించగా మారుతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రావు రమేష్ , సత్య రాజ్ కీలక పాత్రలలో నటించగా , ఈ సినిమాకి  జాక్స్ బీజాయ్ సంగీతాన్ని సమకూర్చాడు.  

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో గోపిచంద్ లాయర్ పాత్రలో నటించగా , రాశి కన్నా సీరియల్ యాక్టర్ పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' మూవీ లో రాశి కన్నా పాత్రను అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. సీరియల్ నటి పాత్రలో రాశి ఖన్నా కడుపుబ్బ నవ్వించబోతున్నట్లు,  రాశి ఖన్నా వచ్చే సన్నివేశాలు అన్నీ కూడా దాదాపుగా కడుపుబ్బ నవ్వించే  విధంగా ఉండబోతునట్లు తెలుస్తోంది.

ఇది వరకు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి రోజు పండగే సినిమాలో రాశి ఖన్నా టిక్టాక్ స్టార్ గా నటించి నవ్వులు పూయించింది. అదే విధంగా పక్కా కమర్షియల్ మూవీ లో సీరియల్ యాక్టర్ గా నటించి నవ్వులు పూయించబోతునట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్,  ట్రైలర్ లలో కూడా రాశి కన్నా తన డిఫరెంట్ మేనరిజమ్స్ లతో , డైలాగ్ డెలివరీతో నవ్వులు పూయిస్తుంది. మరి పక్కా కమర్షియల్ మూవీ లో తన పాత్ర తో రాశి కన్నా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: