సాయి పల్లవి వేసిన స్టెప్పులకు ఫిదా అవుతున్న అభిమానులు వీడియో వైరల్..!!

Divya
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు.. ఫిదా సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి శ్యామ్ సింగ్ రాయ్ సినిమా వరకు ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఇప్పుడు తాజాగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ప్రధాన పాత్రలో నటించడం జరిగింది ఈ చిత్రం ఈ రోజున బ్రహ్మాండంగా విడుదల అవ్వడం జరిగింది. డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు ఇప్పటికే విడుదలైన పాటలకు ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోంది.

ఇక తన సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు చిత్రబృందం ఇందులో భాగంగా చిత్రబృందం నిన్నటి రోజున విశాఖపట్నంలోని విజ్ఞాన జూనియర్ కళాశాల కు వెళ్లడం జరిగింది. అక్కడి విద్యార్థులతో కొన్ని సినిమా విషయాలను కూడా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. కాగా ఈ మేరకు అక్కడ ఉన్న విద్యార్థులు సాయి పల్లవి సరదాగా డాన్స్ చేయమని కోరగా.. తనకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన ఫిదా సినిమాలోని ఒక పాటకు డాన్స్ చేసి అలరించిన ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.

దీంతో అక్కడున్న విద్యార్థులంతా సాయి పల్లవి పేరు పిలిస్తు కేరింతలు చేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా  మారుతోంది అభిమానులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయి పల్లవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో తనకు బాగా పేరు వచ్చే పాత్రలు చేస్తూ ఉండడమే కాకుండా రియల్ స్టోరీ లో కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. మరి విరాటపర్వం సినిమా తో మరొకసారి తన గుర్తింపును చాటుకుంటుంది ఏమో చూడాలి మరి. ఇక ఇందులో రానా హీరోగా నటించారు. నిర్మాతగా సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: