నితిన్ నిర్ణయంతో షాక్ అయిన చిరంజీవి ?

Seetha Sailaja

రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం అదేవిధంగా చిరంజీవి పక్కన స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే చాలు అంటూ అనేకమంది నటీనటులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా యంగ్ హీరో నితిన్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించాడు అంటూ ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పులు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

‘ఆచార్య’ ఇచ్చిన సూపర్ షాక్ నుండి తేరుకోవడానికి చిరంజీవికి రెండు నెలల సమయం పట్టింది. ఈమధ్యనే అమెరికా నుండి తిరిగి వచ్చిన చిరంజీవి తిరిగి తన సినిమాల షూటింగ్ విషయమై దృష్టి పెట్టి వాటిని వేగంగా పూర్తి చేసే ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘వేదాళం’ రీమేక్ లో నటిస్తున్న చిరంజీవి ఆసినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించే విషయంలో ఒక చిన్న సమస్య ఎదురైనట్లు టాక్.

ఈమూవీ కథలో చేసిన కొన్ని మార్పులు వల్ల ఈమూవీ సెకండ్ హాఫ్ లో నటించడానికి ఒక మీడియం రేంజ్ హీరో అతిధి పాత్రలో అవసరం అయినట్లు తెలుస్తోంది. మొదట్లో ఈపాత్రను నాగశౌర్యతో చేయిద్దాం అనుకున్నారట. అయితే నాగశౌర్య ఈవిషయమై పెద్దగా ఆశక్తి కనపరచక పోవడంతో ఇప్పుడు ఈపాత్ర విషయమై నితిన్ పేరు ఆలోచనలలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే నితిన్ కూడ తాను పూర్తి చేయవలసిన సినిమాల షూటింగ్ ల ఒత్తిడిలో తనకు చిరంజీవితో నటించే అవకాశం బాగా ఇష్టం అయినప్పటికీ వేరే మార్గంలేక చేయలేకపోతున్నట్లు సున్నితంగా ఈమూవీ దర్శకుడుకి చెప్పినట్లు గాసిప్పులు వస్తున్నాయి. దీనితో చిరంజీవి ఇలా వేరే యంగ్ హీరోల ప్యాడింగ్ కోసం ఎందుకు ఆరాట పడుతున్నాడు అంటూ కొందరు ఆశ్చర్య పడుతున్నారు. చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో సల్మాన్ ఖాన్ చేత అతిధి పాత్రలో నటింప చేయడం ఆమధ్య రవితేజాతో కలిసి చిరంజీవి నటిస్తున్నాడు అంటూ వార్తలు రావడం వింటున్నవారికి మెగా స్టార్ సరైన కథ ఎంచుకుని సినిమా తీస్తే ఆయనకు వేరే హీరోల సపోర్ట్ ఎందుకు అంటూ మరికొందరి అభిప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: