షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ అదిరే అభి.. చేతికి 15 కుట్లు..?

Anilkumar
ఈటీవీ బుల్లితెర షో అయిన  జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ గురించి మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ షో కే కాదు షో లో నటించే నటీనటు లకి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం చూడొచ్చు.అయితే ఈ షో లో ఒకరైన అభినయ కృష్ణ అలియాస్ అదిరే అభి తెలుగు సినిమాలు మరియు టెలివిజన్‌ షోల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కేరీర్ లో ముందుకు వెళ్తున్నాడు.తాజాగా ఈయన  ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్ కామెడీ షో లో కొనసాగుతున్నారు. ఇక అభి టెలివిజన్ ప్రేక్షకులను పలు స్పెషల్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. 

ఇక 2022 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నాడు. కాగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈయన.ఇకపోతే తొలుత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్  నటించిన 'ఈశ్వర్'లో ఫ్రెండ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక అప్పటి నుంచి అభి యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, స్టాండ్-అప్ కమెడియన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు జబర్దస్త్ లో సూపర్ హిట్ స్కిట్లతోనూ ప్రేక్షకులను అలరిస్తుండగా.. మరోవైపు సినిమాల్లోనూ హీరోగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు.

ఇదిలావుంటే  తాజాగా తను ప్రధాన పాత్రల్లో ఓ చిత్రంతో నటిస్తున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది.అయితే ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా  యాక్షన్ సీక్వెన్స్ ను నిర్మిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఫైటర్ ను ఎదుర్కొనే సమయంలో అదిరే అభి ప్రమాదానికి గురయ్యాడు. కాగా ప్రమాదంలో చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ముఖ్యంగా చేతికి పెద్దగాయమే తగిలింది.అప్పటికప్పుడే  వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. ఇదిలావుంటే దాదాపు 15 కుట్లు పడ్డాయని చిత్ర యూనిట్ లోని ఒకరి తెలిపారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు  ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: