మొదటిసారి బుల్లితెరపై అదరగొట్టిన రవితేజ 'ఖిలాడీ'..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అలా క్రాక్ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి మూవీ లో హీరోగా నటించాడు.

రవితేజ క్రాక్ సినిమా తర్వాత నటించిన సినిమా కావడంతో ఖిలాడి మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ మూవీ లో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఈ మూవీ లో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తమ హాట్ హాట్ స్కిన్ షో తో ప్రేక్షకులను ఎంత గానో అలరించారు. కానీ వెరీ హాట్ స్కిన్ షో కూడా ఈ సినిమాను విజయం వైపు తీసుకు వెళ్లలేక పోయాయి. ఇలా థియేటర్ లలో ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయిన ఖిలాడి సినిమా తాజాగా బుల్లి తెర పై ప్రసారం అయ్యింది .

థియేటర్ ల్స్లో ప్రేక్షకులను అలరించ లేకపోయిన ఈ సినిమా బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది . మొదటి సారి రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి సినిమా స్టార్ మా లో ప్రసారం అయినప్పుడు 7.07 'టి ఆర్ పి' ని సాధించింది. థియేటర్ లలో ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయిన ఈ సినిమా బుల్లి తెరపై 'టి ఆర్ పి' ని సాధించడం అంటే గొప్ప విషయమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: