తనపై సినిమా తీయలంటూ.. రాజమౌళి కి రిక్వెస్ట్ చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్..!

Anilkumar
హైదరాబాద్ కు చెందిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ మనందరికీ తెలిసే ఉంటాడు.అయితే తాజాగా ఈయన తనపై సినిమా తీయాలంటూ దర్శకధీరుడు రాజమౌళిని రిక్వెస్ట్ చేసాడు. ఇక వివరాల్లోకి వెళితే, శ్రీకాంత్ నేతృత్వంలోని భారత బ్యాడ్మింటన్ బృందం 2022 థామస్ కప్ ను గెలుచుకుంది.ఇకపోతే బ్యాడ్మింటన్ చరిత్రలో ఇండియా థామస్ కప్ గెలవడం ఇదే తొలిసారి. అయితే ఎప్పుడో 1949 లో మొదలైన ఈ థామస్ కప్ ఛాంపియన్ షిప్ లో ఇండియా ఇన్నాళ్ళకి విజేతగా నిలవడం పట్ల ప్రధానమంత్రి మోడీ సైతం ఆనందాన్ని వెలిబుచ్చారు. ఇక ఇంతటి ఘనచరిత్ర కలిగిన సంఘటనకు శ్రీకాంత్ నేతృత్వం వహించడం విశేషం. 

అంతేకాదు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కిదాంబి శ్రీకాంత్, హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియా థామస్ కప్ విజయం పై ఎస్. ఎస్, రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడు సినిమా తీస్తే బావుంటుందని తెలిపారు.దీనితోపాటు  1983లో తొలిసారి ఇండియా క్రికెట్ లో ప్రపంచ కప్ ను సాధించింది. అంతేకాదు ఈ అరుదైన ఘట్టాన్ని హిందీలో 83 పేరుతో సినిమా తీశారు. ఇక అలానే థామస్ కప్ పై సినిమా తీస్తే ఎవరు డైరెక్టర్ గా ఉంటె బావుంటుందని విలేఖరి అడిగిన ప్రశ్నకు శ్రీకాంత్ ఈ ఆన్సర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కూడాను. ఇకపోతే రాజమౌళి వంటి వారు డైరెక్షన్ చేస్తానంటే, థామస్ కప్ పై తెరకెక్కించే మూవీలో నేను నటించడానికి ఓకే అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

అయితే ఒకవేళ రాజమౌళి కనక ఇలాంటి సినిమాను రూపొందిస్తే, ఖచ్చితంగా ఆ సినిమాకు ఇంటెర్నేషనల్ అటెన్షన్ వస్తుంది.కాగా  నితిన్ తో సై సినిమా తర్వాత రాజమౌళి క్రీడా నేపధ్యమున్న చిత్రాన్ని ఇప్పటివరకు తీయలేదు. ఇదిలావుండగా కిదాంబి శ్రీకాంత్ రిక్వెస్ట్ ను రాజమౌళి యాక్సెప్ట్ చేస్తాడో.. లేదో.. అసలు రాజమౌళి నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: