రోలెక్స్ పై సెపరేట్ సినిమా కూడా కావాలట..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తమిళ హీరోలకు ఎంతటి స్థాయిలో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. వారి సినిమాలు డబ్బింగ్ ద్వారా విడుదలైన కూడా తెలుగులో నేరుగా విడుదలైన సినిమాలకు సమానంగా కలెక్షన్లు వస్తాయి అంటే అక్కడి హీరోలకు ఇక్కడ ఎంతటి మార్కెట్ వుందో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా తెలుగులో భారీ స్థాయిలో మార్కెట్ కలిగిన హీరో సూర్య గజిని సినిమా తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమై భారీ మార్కెట్ ను కలిగి ఉన్నాడు. ఈ హీరో ఆ తర్వాత తన సినిమాలను విడుదల చేస్తూ పెద్ద హీరోగా మారాడు.

తెలుగు హీరో కాకపోయినా కూడా ఈ హీరో ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడో అందరికీ తెలుసు. తెలుగులో స్టార్ హీరో కి ఉన్న ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోయినా కూడా ఇంతటి స్థాయిలో ప్రేక్షకుల అభిమానం ఆయనకు ఉంది అంటే ఆయన నటనకు అభిమానులు ఎంతగా ఫిదా అవుతారో అర్థం అవుతుంది. గత కొన్ని రోజులుగా ఆయన మంచి సినిమాలతో అలరిస్తూ ఉండడం ఆయనకు ఇక్కడ మరింత మార్కెట్ పెరగడానికి కారణం.

తాజాగా ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. హీరో పాత్ర కాకపోయినా కూడా ఆయన క్లైమాక్స్ లో వచ్చే గెస్ట్ పాత్ర కోసం ఈ సినిమాలో నటించడం ఆయన యొక్క సింప్లిసిటీ కి అద్దం పడుతుంది. ఈ పాత్ర ఉన్నది కొన్ని నిమిషాలు అయినా కూడా థియేటర్లలో ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ అయ్యారు. ఈ నేపథ్యంలో పాత్ర మీద ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఆయన అభిమానుల నుంచి డిమాండ్ ఏర్పడుతుంది. మరి దర్శకుడు లోకేష్ భవిష్యత్తులో ఈ పాత్రకు సంబంధించిన పూర్తి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: