షారుక్ ఖాన్... అట్లీ కాంబినేషన్ మూవీకి అదిరిపోయే టైటిల్..!

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ తాను నటించిన మూవీ ల ద్వారా ఇండియా వ్యాప్తంగా నే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇలా హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గత కొద్ది కాలంగా వరుస  అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయాడు.

అలా వరుసగా విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురవడంతో షారుక్ ఖాన్ కొంత కాలం పాటు మూవీ లకు కూడా దూరంగా ఉన్నాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఏ మూవీ లో కూడా నటించిని షారుక్ ఖాన్ ప్రస్తుతం మాత్రం వరుస పెట్టి మూవీ లను లైన్ లో పెడుతున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే షారుక్ ఖాన్ 'పటాన్' మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ తో పాటు షారుక్ ఖాన్ ఇటీవలే డంకి అనే మూవీ ని ప్రారంభించాడు.

ఇలా ఇప్పటికే రెండు క్రేజీ మూవీ లను లైన్ లో పెట్టిన షారుక్ ఖాన్ తమిళ క్రేజీ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే అట్లీ,  షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి  జవాన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ లో షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయన తార ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: