పులిహోరను అద్భుతంగా కలిపిన శ్రీరెడ్డి..

Satvika
శ్రీరెడ్డి..ఈ పేరు గురించి పదే పదే చెప్పాల్సిన పని లేదు.. అందరికి సుపరిచితమే.. ఏదో చెద్దామని అనుకొని బయటకు వచ్చిన అమ్మడు ఇంకేదో చేసి బాగా ఫెమస్ అయ్యింది..టీవీ చానెల్ లో యాంకర్ గా పరిచయం అయిన  ఈమె అక్కడ కొన్నెల్లు సక్సెస్ ఫుల్ గా పని చేసింది..ఆ తర్వాత కూడా పలు చానెల్స్ లో కనిపించి మెప్పించింది.తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నాలు చేసింది..మొత్తానికి కష్టపడి ఒకటి రెండు సినిమాలను చేసింది.ఆ సినిమాలు అనుకున్న పేరును అందివ్వలేక పోయాయి.దాంతో మరో కొత్త ప్రపంచం లోకి వెళ్ళింది..చాన్స్ లు రావాలంటే పడుకోవాలా అంటూ ఒక ఉద్యమానికి తెర లేపింది.

 
అది సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎంతగా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని కూడా పెంచుకుంది. అందాల ఆరబోతతో కూడా నానా రచ్చ చేసి హాట్ టాపిక్ అయింది...


ఇప్పుడు చెన్నైకి వెళ్ళిన ఈమె ఓ యూట్యూబ్ ఛానెల్ ను పెట్టి మరీ తాను అనుకున్నది అందరితో షేర్ చేసుకుంది.వెరైటీ వంటకాలు పరిచయం చేస్తూ నెటిజన్స్‌కి మంచి థ్రిల్ అందిస్తుంది.చెన్నైలో మాత్రమే దొరికే ఈలి పీతల పులుసు రుచిచూపించింది. దాంతో పాటుగా.. ఈ పీతల పులుసు రుచి చేస్తే బెడ్ రూంలో నుంచి బయటకు రాలేరంటూ మసాలా దట్టించింది శ్రీరెడ్డి. వెరైటీ వంటకాలతో నానా రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఆంధ్రా స్టైల్‌లో పులిహోర చేసింది.అమ్మడి మాటలకు ముగ్ధులు అవుతున్న ఫ్యాన్స్ వీడియోలని పదే పదే చూస్తూ పరశించిపోతున్నారు..మొత్తానికి అది కాస్త వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: