పవన్ - రాజమౌళి అయ్యే పనేనా..?

P.Nishanth Kumar
చాలా రోజుల నుంచి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అని వా ర్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా తో సంచలనం సృష్టించిన దర్శకుడు రాజమౌళి తో కలిసి సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా కలలు కంటూ ఉంటాడు. ముఖ్యంగా యంగ్ హీరోలు అయితే ఆయనతో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ దక్కించుకోవాలని భావిస్తూ ఉంటారు.

ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొనగా మహేష్ బాబు తో ఆయన సినిమా చేయడం ఒక్కసారిగా అందరినీ ఎంతో సంతోష పరిచింది. త్వరలోనే ఈ సినిమా మొదలు కాబోతుంది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక పెద్ద నిర్మాత ఈ సినిమా కోసం ఇద్దరిని లాక్ చేశారని అంటున్నారు. వాస్తవానికి చాలా రోజుల క్రితమే వీరి మధ్య సినిమా రావడానికి ప్రయత్నాలు జరగాయి కానీ ఫలించలేదు.

అలాంటిది ఇప్పుడు ఈ సినిమా వస్తుంది అంటే పవన్ అభిమానులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. రాజమౌళి తో మహేష్ బాబు సినిమా పూర్తి చేయాలంటే కనీసం రెండేళ్లు అయినా పడుతుంది. ఆలోపు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో ఇప్పట్లో సినిమా రావడం చాలా కష్టమని వారు భావిస్తున్నారు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఇది నిజం అనిపిస్తుంది కూడా. ఎన్నికల లోపు పవన్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడమే గగనం అయిపోతున్న సమయంలో రాజమౌళి తో సినిమా చాలా కష్టం అనే చెప్పాలి. మరి ఈ రకమైన పుకార్లు ఎప్పుడూ ఆగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: