ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర.. ట్రైలర్ గ్లింప్స్..!!

Divya
టాలీవుడ్ నుండి ఈ సంవత్సరం రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా బ్రహ్మాస్త్ర. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా బ్రహ్మాస్త్రం మనీ టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సోఫియా ఫాంటసి అడ్వెంచర్ చిత్రంలో నాగార్జున కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని మూడు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మొదటి భాగాన్ని బ్రహ్మాస్త్ర శివ అనే పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఇక విడుదలకు కేవలం వంద రోజులు నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే రణబీర్కపూర్, అయాన్ ముఖర్జీ, రాజమౌళి ఈ రోజున వైజాగ్లో సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగానే బ్రహ్మాస్త్ర ట్రైలర్ తేదీని వెల్లడించడం జరిగింది. బేకర్స్ అందుకు సంబంధించి ఒక గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ 35 సెకండ్ల ఉన్న వీడియో లో విజిల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు రణబీర్ , ఆలియా భట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో నాగార్జున, అమితాబచ్చన్, వంటి పాత్రల తారాగణాన్ని  చూపించారు.

నాగార్జున ఇందులో చాలా సరికొత్త లుక్ లో కనిపించారు. ఇక నాగార్జున కళ్ళల్లో స్పార్క్ రావడాన్ని.. బట్టి చూస్తే అతీత శక్తులు కలిగి ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు గా కనిపిస్తోంది. 2003 తర్వాత హిందీ సినిమాలకు దూరంగా ఉన్న నాగార్జున ఇప్పుడు తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలో ఇంతకు ముందు ఎన్నడూ నటించిన పాత్రలు నటించి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్ హాలీవుడ్ మూవీ తలపించేలా ఉన్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో గ్లింప్స్ వైరల్ గా మారుతోంది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: