కాంగ్రెస్ పై హీరోయిన్ నగ్మా షాకింగ్ కామెంట్స్..!!

Divya
రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో కీలకమైన నేతలను పక్కన పెట్టడంతో బయట వారికి అవకాశం ఇవ్వకుండా కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకురాలు నటి నగ్మా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యింది. అసలు విషయం ఏమిటంటే వచ్చే నెల 10వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున 10 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.
కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపనుంది. పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ .. ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, కర్ణాటక నుంచి జైరామ్ రమేష్, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రమోద్ తివారి, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ పథాక్ లకు  అవకాశం కల్పించారు. ఇక వీటితోపాటుగా రాజీవ్ శుక్లా చత్తీస్ ఘడ్ మాజీ ఎంపీపీ పుష్ప యాదవ్ సతీమణి రంజిత్.. తదితరులు సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేయనున్నారు..అయితే ఈ ఎంపిక కొంతమంది సీనియర్ నేతలను చాలా అసంతృప్తికి గురి చేసినట్లుగా తెలుస్తోంది.
రాజ్యసభ సీటు ఆశించి భంగపాటుకు గురైన పార్టీ అధినేత అయినటువంటి ప్రతినిధి పవన్ ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని తెలియజేశారు. నా తపస్సును ఏదైనా గాయం తగిలి ఉంటుందేమో అన్నట్టుగా ట్వీట్ చేశారు. పవన్ ఖేరా ట్వీట్ కు నగ్మా స్పందిస్తూ.. నా పద్దెనిమిదేళ్ల తపస్సుకి కూడా ఇమ్రాన్ ఖాన్ ముందు తక్కువైంది అంటూ పార్టీపై విమర్శలు గుప్పించింది.. 2003-04 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను రాజ్యసభకు పంపుతానని తెలియజేసిందని.. అప్పటి నుంచి ఈ 18 ఏళ్ల లో వారు నాకు ఒక్కసారి కూడా అవకాశం కల్పించలేదని ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ని ఎంపిక చేయడం ఆ పదవికి నేను కూడా తక్కువ అర్హురాలినేనా అంటూ  నగ్మా ప్రశ్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: