'అవును.. నేను ప్రేమలో ఉన్నాను': అనుపమ పరమేశ్వరన్

Anilkumar
'ప్రేమమ్‌' సినిమాతో తెలుగువారికి దగ్గరైంది కేరళ కుట్టీ అనుపమ.అయితే ఈమె తొలి చిత్రంతోనే కుర్రకారు హృదయాలను దోచుకుంది ఈ బ్యూటీ .కాగా ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం '18 పేజీస్‌', 'కార్తికేయ 2', 'బటర్‌ఫ్లై' చిత్రాల్లో నటిస్తున్న అనుపమ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇకపోతే తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు ఈమె . అదేంటంటే పెళ్లంటూ చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటానని అన్నారు.దీనితోపాటు ఆమె  ''నాకు ప్రేమ వివాహంపై సదాభిప్రాయం ఉంది. అంతేకాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్ని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. ఇకపోతే నాక్కూడా ప్రేమ పెళ్లే చేసుకోవాలని ఉంది.

 అయితే మా ఇంట్లో వాళ్లకి కూడా ఈ విషయం తెలుసు. ఇక నేను పెళ్లి చేసుకుంటే అది తప్పకుండా ప్రేమ పెళ్లే అవుతుంది'' అని అనుపమ చెప్పంది. అయితే ''ఇంతకీ మీరు ప్రేమలో ఉన్నారా? లేదా సింగిల్‌గానే ఉన్నారా?'' అని ప్రశ్నించగా..ఆమె సమాధానమిస్తూ  ''నేను సింగిల్‌.. కాదు మింగిల్‌..!! ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ...దీనితోపాటు ఆమె ఎందుకంటే నా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ నాక్కూడా సరిగ్గా తెలియడం లేదు. ఇక నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి, అవతలి సైడ్‌ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. అందుకే వన్‌ సైడ్‌ లవ్‌ అని చెప్పగలను'' అంటూ నవ్వులు పూయించారు. అయితే అనంతరం ఆమె మాట్లాడుతూ.. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు.

అంతేకాకుండా అలాగే, సోషల్‌మీడియాలో తనపై వచ్చే మీమ్స్‌ని అప్పుడప్పుడూ ఫాలో అవుతుంటానని.. వాటిని చూసి నవ్వుకుంటానని అన్నారు.ఇక అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ తో కలిసి '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని అతి త్వరలోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. సుకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమాకి కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: