'ఎఫ్3' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

Anilkumar
తాజాగా వెంకటేష్ మరియు  వరుణ్ తేజ్ మల్టీస్టారర్ "ఎఫ్2" సినిమాకి సీక్వెల్ గా "ఎఫ్3" విడుదలైంన సంగతి తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా మరియు మెహరీన్ లు హీరయిన్లుగా చేశారు.ఇకపోతే రఘుబాబు, ప్రగతి, సునీల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. కాగా ఒక సరికొత్త స్టోరీ లైన్ తో భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 27 న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా  మొదటి రోజు డివైడ్ టాక్ ను అందుకుంది. 


కాగా  ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఆదరించటంతో ఈ సినిమా ఈ వీకెండ్ లో దుమ్ము దులిపింది.తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వీకెండ్ లో ఈ సినిమా దాదాపు రూ. 20 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం.అంతేకాకుండా ఇది బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్ 2కి సీక్వెల్ కావడంతో ట్రేడ్ పండితులు ఇంకా పెద్ద అంకెలు అంచనా వేశారు. ఇకపోతే తెలంగాణ కంటే ఆంధ్రాలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కాగా ఓవర్ సీస్ లోనూ ఈ చిత్రం బాగానే వర్కవుట్ అయ్యింది.అంతేకాదు  USA లో ఇది సుమారు $1 మిలియన్ (రూ. 7.7 కోట్ల గ్రాస్) వసూలు చేసింది, ఇది మంచి కలెక్షనే.


ఇక ఈ సినిమా  వారం రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తే రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయం.ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కు ముందు `సాధారణ టికెట్ రేట్లకే సినిమా` అంటూ మిడిల్ క్లాస్ ప్రేక్షకుల్ని థియేటర్లవైపు రప్పించడానికి దిల్ రాజు ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది.అయితే అదే కలిసొచ్చిందంటున్నారు. ఇక ఈ సినిమా మౌత్ టాక్ ని బట్టి... రెస్పాన్స్‌ని బట్టి, ప్రేక్షకుల మ్యాట్నీ నుంచి పికప్ అయ్యిందని తెలుస్తోంది. కాగా  ``ఎఫ్ 3 మాస్ సినిమా కాదు. ఇది ఫ్యామిలీ సినిమా కుటుంబ ప్రేక్షకులే ఈ సినిమాకి బలం. అయితే వాళ్లు మౌత్ టాక్ ని బట్టే థియేటర్లకు వస్తారు.కాగా  శని, ఆదివారాల నుంచి... థియేటర్లు నిండుతాయి`` అని లెక్కలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

F3

సంబంధిత వార్తలు: