"జై భీమ్" సీక్వెల్ కు సూర్య రెడీ ?

VAMSI
సీనియర్ హీరో సూర్య వయసు పెరుగుతూ ఉంటే తన అందాన్ని మరింత పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే అంతే హ్యాండ్సమ్ గా యంగ్ గా కనిపిస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను ఈ సార్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఈ హీరో సినిమా వస్తుంది అంటే టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.. అసలు ఈయన కేవలం తమిళ హీరో అన్న భావన కలుగదు. అంతగా తెలుగు ప్రేక్షకుల మదిని సైతం గెలుచుకుని ఇక్కడ కూడా స్టార్ హీరోగా ఎదిగారు హీరో సూర్య. అంతే కాకుండా హీరోయిన్ జ్యోతిక భర్త గా కూడా చాలా మంది తెలుగు ప్రజలు ఈయనను అభిమానిస్తారు.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈ హీరోకి సంబందించిన వార్త ఒకటి అందరినీ ఊరిస్తోంది. మరోసారి క్రేజీ హిట్ కాంబో తో మన ముందుకు రాబోతున్నారట సూర్య. వివరాలు ఇలా ఉన్నాయి.  ప్రస్తుతం సూర్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆకాశమే నీ హద్దు చిత్రం తరవాత హిట్ ట్రాక్ పై తన జోరు చూపెడుతున్నాడు ఈ హీరో.  ఇటీవలే ఈ టి సినిమాతో మనం ముందుకు వచ్చి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. అలా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుని జోరు పెంచారు. కాగా ఇప్పుడు బాల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. శివ పుత్రుడు వంటి సినిమా తర్వాత మరోసారి బాల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు సూర్య. అదే విధంగా దర్శకుడు వెట్రిమారన్‌ డైరెక్షన్ లో ‘వాడివాసల్‌’ అనే సినిమా కూడా పట్టాలెక్కించాడు.
అయితే ఈ రెండు ప్రాజెక్టు లు పూర్తయితే తదుపరి దర్శకుడు జ్ఞానవేల్‌ తో సూర్య సినిమా ఉండనుంది అని కోలీవుడ్ లో టాక్ మొదలయ్యింది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'జై భీమ్‌' సినిమాతో ప్రశంసలతో పాటుగా విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఈ సినిమాకు ఎక్కువ మంది ప్రేక్షక అభిమానులు మద్దతు పలుకుతూ విజయవంతం చేశారు. అయితే ఇపుడు మరోసారి ఈ కాంబో ట్రాక్ ఎక్కనుందని సమాచారం.  ఇప్పటికే సూర్య కథ కూడా విని ఒకే చేశారని అంటున్నారు. త్వరలో  ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీలో వినికిడి. అయితే కొందరి నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం జై భీం కు సీక్వెల్ గా ఇది ఉండనుంది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: