శేఖర్ సినిమా కు గుడ్ న్యూస్ చెప్పిన కోర్టు..!
ఇకపోతే కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లుగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ అలాగే నిర్మాత తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవిత రాజశేఖర్ తో పాటు నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం రోజు కోర్టులో వెల్లడించారు. ఇకపోతే ఈ మేరకు రాజశేఖర్ నటించిన సినిమా ఆగిపోవడంతో తమకు నష్టం జరుగుతోందని ఈ సినిమా నెగిటివ్స్ మీద ఉన్నా రద్దు చేయాలని కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఇక అదే సమయంలో పరంధామరెడ్డి తరపు లాయర్లు కూడా సినిమా ప్రదర్శించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే వచ్చే కలెక్షన్లలో మాకు ఇవ్వాల్సిన రూ.60 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని కోరడం జరిగింది. దీనికి ఏకీభవించిన జడ్జి వెంటనే సినిమా పునః ప్రారంభించాలని ప్రదర్శనకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు జీవిత రాజశేఖర్ ఇటు నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పవచ్చు. అసలే కష్టాల్లో ఉన్న జీవిత రాజశేఖర్ లు కనీసం ఈ సినిమాతో నైనా ఆర్థికంగా మెరుగు పెడతారో లేదో తెలియాల్సి ఉంది.