విక్రమ్ కి హైప్ మాములుగా లేదుగా.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే!

Purushottham Vinay
ఇక చాలా కాలం తర్వాత కమలహాసన్ చేస్తున్న సినిమా విక్రమ్.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగా ఊపందుకున్నాయి. విక్రమ్  ట్రైలర్ ఒక్కో భాషలో ఒక్కో రోజు రిలీజ్ చేసి, ప్రమోషన్ హీట్ బాగా పెంచుతున్నారు మేకర్స్.ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విక్రమ్ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.. అలాగే ఈ సినిమా తెలుగు హక్కులను కూడా మరో యంగ్ హీరో సొంతం చేసుకున్నారు.. ఇలా రోజు రోజుకీ సరికొత్త అప్ డేట్ తో హైప్ పెంచుకుటుంది విక్రమ్ సినిమా.ఇక ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ యూనివర్శల్ హీరో కమలహాసన్ నటిస్తూ నిర్మిస్తన్న లేటెస్ట్ సినిమా విక్రమ్.. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేసి, ఇక సినిమా టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఆల్రెడీ తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రయిలర్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. జూన్ 3 వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా ప్రమోషన్స్ బాగా స్పీడందుకున్నాయి.


ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా పై పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయ్యింది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించి, విక్రమ్ సినిమాపై మరింత హైప్ ని తీసుకొచ్చారు కమలహాసన్. ఇప్పుడు తెలుగులో కూడా విక్రమ్ సినిమా తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేటుకి నితిన్ శ్రేష్ట్ మూవీస్ తీసుకుంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విక్రమ్ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమలహాసన్, విజయ్ సేతుపతి ఇంకా ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ఈ సినిమాలో సూర్య కూడా గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. అనిరుధ్ రవించద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ ని సమకూరుస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమలహాసన్ ఇంకా ఆర్ మహేంద్రన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: